Mahaa Daily Exclusive

  కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజలు పెట్టిన భిక్షే: సీఎం రేవంత్

Share

గతంలో కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజలు పెట్టిన భిక్షేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చాక పాలమూరుకు అన్యాయం జరిగింది. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ దోచుకున్నారు. నాపై కోపంతో పాలమూరుపై కక్ష గట్టారు. పాలమూరు పేదరికాన్ని చూపించి మార్కెటింగ్ చేశారు’ అని అన్నారు.