యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ గోపురం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పాల్గొంటారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు. 50.5 అడుగుల ఎత్తు, 68 కేజీల బంగారంతో చేసిన స్వర్ణతాపడ గోపురం దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కింది.
Post Views: 127







