Mahaa Daily Exclusive

  మహాశివరాత్రికి 3వేల స్పెషల్‌ బస్సులు…!

Share

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేబీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని టీజీఎస్‍ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు వెళ్లేందుకు 3,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 24 నుంచి 28 వరకూ అందుబాటులో ఉంటాయని అన్నారు. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతోపాటు అలంపూర్‌, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు సైతం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.