Mahaa Daily Exclusive

  రేవంత్‌ విజన్‌ ఉన్న నాయకుడు పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ …!

Share

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఆగంతకుల నుంచి సోమవారం మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు తనను బెదిరించినట్లు రాజాసింగ్‌ తెలిపారు. రెండు గుర్తు తెలియని ఫోన్‌ నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. గతంలోనూ రాజాసింగ్‌కు పాకిస్తాన్‌,ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై అప్పట్లో రాజాసింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. రాజాసింగ్‌కు హత్యకు కుట్రపన్నినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.
శివ స్వాముల పై లాఠీఛార్జ్ పై మండిపాటు మాలలో ఉన్న శివ స్వాములపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. శ్రీశైలాన్ని అపవిత్రం చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ముస్లింలకు షాప్‌లు కేటాయించారని, శివస్వాములపై పోలీసుల లాఠీచార్జ్‌ సరికాదని అన్నారు. అలాగే పవిత్ర క్షేత్రాల వద్ద ముస్లింలకు ఆలయాల దగ్గర షాపులు కేటాయించొద్దని, సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కు విజ్ఞప్తి చేస్తున్నానని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.