నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయనను రాయచోటి పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను అనంతపురం తీసుకెళ్తున్నారు. అనంతపురంలో పోసానిపై కేసు నమోదు అయింది. . గతంలో పోసాని కృష్ణ మురళి వైసీపీలో పని చేసిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా కొద్ది రోజులుగా వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
Post Views: 80








