*వరంగల్లో ఘనంగా డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం*
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్లో నిర్వహించిన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతంలో డీసీసీ కార్యవర్గం కీలక పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా కమిటీ పదాధికారులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







