TG: ‘రాష్ట్ర హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రభుత్వం ఆపటం లేదు. గోదావరిపై ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే కాంగ్రెస్ సర్కారు నోరెత్తటం లేదు. కృష్ణా జలాలపై మేం నిలదీసిన తర్వాత కేఆర్‌ఎంబీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు’అని విమర్శించారు.
Post Views: 153








