Mahaa Daily Exclusive

  రేపు లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Share

తెలంగాణ ప్రభుత్వం రేపు (మార్చి 1) మూడు జిల్లాల్లో లక్ష మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాలను మినహాయించి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. కాగా ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న రేషన్ కార్డుల మాదిరి కాకుండా.. ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్, యూనిక్ నంబర్‌తో స్మార్ట్ రేషన్ కార్డులను అందించనుంది.