Mahaa Daily Exclusive

  మార్చి 3 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు: మందకృష్ణ మాదిగ

Share

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ నివేదికలో లోపాలను సవరించాలని డిమాండ్‌ చేస్తూ MRPS, దాని అనుబంధ సంఘాలన్నీ మార్చి 3 నుంచి 10వ తేదీ వరకు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి 1న ‘మాదిగ అమరుల దినం’ జరపాలన్నారు. ప్రభుత్వ స్పందనను బట్టి 11న కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.