2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం రూ.3.22 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసన సభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. వ్యవసాయానికి రూ.48వేల కోట్లు, తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే, ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చిన సూపర్-6 సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిచ్చినట్లు స్పష్టమవుతోంది.
బడ్జెట్.. కేటాయింపుల వివరాలు
రూ.3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్
రెవెన్యూ వ్యయం- రూ.2,51,162 కోట్లు
రెవెన్యూ లోటు – రూ.33,185 కోట్లు
ద్రవ్య లోటు- రూ.79,926 కోట్లు
మూలధన వ్యయం అంచనా- రూ.40,635 కోట్లు
వ్యవసాయానికి రూ.48వేల కోట్లు
వైద్యారోగ్య శాఖకు రూ.19,265 కోట్లు
ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
జల వనరుల శాఖకు రూ.18,020 కోట్లు
రవాణా శాఖకు రూ.8,785 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు
యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
జల్ జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు
ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు
దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు








