దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని 2 లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. మహా శివరాత్రి పర్వదినాన వేములవాడ రాజన్న ఆలయానికి కోటీ 31 లక్షల 89 వేల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కోడె మొక్కుల ద్వారా 45 లక్షల 83 వేలు, ప్రసాదాల ద్వారా 57 లక్షల 12 వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఐదు లక్షల లడ్డూలను పంపిణీ చేశారు. మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 26న జరిగిన మహాశివరాత్రి జాతర కోసం తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి భక్తులు తరలివచ్చారు.
Post Views: 90








