ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ శనివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మాట్లాడారు. “పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు. తీన్మార్ మల్లన్నను చాలా సార్లు తీవ్రంగా హెచ్చరించాం. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. కాంగ్రెస్ పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టం” ఆయన పేర్కొన్నారు.
Post Views: 198








