టాలీవుడ్ లో పట్టిందల్లా బంగారమయ్యే దర్శకులలో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకూ అనిల్ రావిపూడి తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఈమధ్య కొందరు వ్యూస్ కోసం చేసే తప్పుడు ప్రచారాల కారణంగా సినీ సెలెబ్రెటీలు చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి చిక్కుల్లోనే పడ్డ డైరక్టర్ అనిల్ రావిపూడి ఓ హీరోయిన్ విషయంలో ఇటీవలే సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఇటీవలే అనిల్ రావిపూడి ఓ సినిమా ప్రమోట్ చేసేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో యాంకర్ మాట్లాడుతూ మీ నెక్ట్స్ సినిమాలో కూడా హీరోయిన్ మీనాక్షి చౌదరిని కంటిన్యూ చెయ్యండి.. మీకు ఆమెకి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటూ సరదాగా కామెంట్లు చేసింది. దీంతో కొందరు వ్యూస్ కోసం ఈ కామెంట్లని వక్రీకరించి ఫేక్ థంబ్ నెయిల్స్ పెడుతూ వీడియోలు, మీమ్స్ షేర్ చేస్తున్నారు. దీంతో కొందరు అనిల్ రావిపూడి బంధువులు ఈ వీడియోలని తన భార్యకి షేర్ చేస్తున్నారట. చివరికి ఈనోటా ఆ నోటా పాకుతూ అనిల్ రావిపూడి చెవిన పడింది. దీంతో వెంటనే అనిల్ రావిపూడి సైబర్ క్రైమ్ పోలీసులని సంప్రదించి ఫిర్యాదు చేశాడు.. అలాగే తాను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నానని తనకెలాంటి కెమిస్ట్రీలు లేవని క్లారిటీ ఇచ్చాడు. అలాగే తన గురించి కెమిస్ట్రీ వీడియోలు షేర్ చేసిన వారిని వీడియోలు తొలగించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. కొందరు నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ ఒకే సినిమాలో కలసి పని చేసినంత మాత్రాన హీరోయిన్, డైరెక్టర్ మధ్య ఎదో ఉందంటూ ప్రచారాలు చెయ్యడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.








