Mahaa Daily Exclusive

  CM రేవంత్‌కు పరిస్థితి వివరించి ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటా: సీతక్క

Share

హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరు బాగోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆదిలాబాద్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించి బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటన చేశారు.