Mahaa Daily Exclusive

  లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక – కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం: అధ్యక్షకార్యదర్శులు

Share

ఇబ్రహీంపట్నం జూన్ 21 మహా:

లింగంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం మంచాల మండల అధ్యక్షులు ఎడమ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి హాజరైన, ఇబ్రహీంపట్నం ఏఎంసి చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెదిరె హనుమంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అమ్మనబోలు సంజీవరెడ్డిల సమక్షంలో లింగంపల్లి గ్రామ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా అనిరెడ్డి జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా లింగం యాదవ్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తామని, మండల గ్రామ నాయకులు కలుపుకొని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. తమకు ఈ అవకాశాన్ని కల్పించిన స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెర్కా మూర్తి, ఐలేష్ కుమార్ యాదవ్, భారత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, అశోక్ గౌడ్, శ్రీకాంత్, సురేష్, కర్ణాకర్ రెడ్డి, మధు పెర్కా తదితరులు పాల్గొన్నారు.