Mahaa Daily Exclusive

  ఐటీ సెల్ హెడ్ ఒక వెదవ.. అతనికి దిమాక్ లేదు మీడియా ఇంటర్వ్యూలలో మధుయాష్కీ సంచలన కామెంట్స్..!

Share

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ తీరుపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ లో రెడ్లపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలంటే చాలా ధైర్యంగా ఉండాలన్నారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే పార్టీ రూల్స్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై క్రమ శిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేశాడన్నారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. బీసీ నాయకుల మీటింగ్‌కు బీసీ నాయకులను పిలవరా? అని ప్రశ్నించారు. బీసీ మీటింగ్‌కు జానారెడ్డి, కేశవరావును ఎందుకు పిలిచారన్నారు. ఇటీవల కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టిన పోల్ లో ఫామ్ హౌజ్ పాలనే కావాలంటూ మెజార్టీ ఓట్లు వచ్చిన విషయంపై సైతం మరో ఇంటర్వ్యూలో స్పందించారు మధుయాష్కి. కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ ఒక వెదవ.. అతనికి దిమాక్ లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.