Mahaa Daily Exclusive

  అధికారంలోకి వచ్చేది వైసీపీనే: గోరంట్ల మాధవ్

Share

కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పైనే దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.