కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయని, కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీ యేతర అభ్యర్థులను బరిలోకి దింపడంతో ఓట్లు చీలాయని.. కాబట్టి బీసీలందరూ ఇప్పుడు ఏకం కావాలని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు.
Post Views: 169








