Mahaa Daily Exclusive

  మీడియాలో మహిళల రక్షణ కోసం నూతన పాలసీ: సీతక్క

Share

మీడియా రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కొత్త పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో మీడియాది కీలక పాత్ర అని తెలిపారు. మీడియాలో పని చేసే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలని నూతన పాలసీని రూపొందిస్తామని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయని, వారి ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని సీతక్క హామీ ఇచ్చారు.