Mahaa Daily Exclusive

  ప్రతి మహిళను తమ ఇంట్లో ఒక ఆడబిడ్డలా చూడాలి: సీతక్క

Share

సమానత్వం మహిళా దినోత్సవ ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్‌ ప్లాజా నుంచి రన్‌ ఫర్‌ యాక్షన్‌-2025 నిర్వహించగా సీతక్క హాజరై మాట్లాడారు. ‘మహిళల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తున్నారు. పురుషుడు ప్రతి మహిళను తమ ఇంట్లో ఒక ఆడబిడ్డలా చూస్తే వారు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలుగుతారు. మహిళలను ఎదగనిద్దాం.. గౌరవిద్దాం.. ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరగనిద్దాం’ అని అన్నారు.