Mahaa Daily Exclusive

  పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు: మంత్రి కొలుసు

Share

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి 2029 నాటికి మెరుగైన, నాణ్యమైన ఇళ్లు నిర్మిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 33 లక్షల మందికి స్థలాలు ఇస్తున్నామని ప్రకటించి, జగనన్న కాలనీల పేరిట రూ.18 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి టిడ్కో, హౌసింగ్ శాఖ కలిపి 5 లక్షల ఇళ్లు పూర్తి చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.