Mahaa Daily Exclusive

  లెక్చరర్లుగా ఎంపికైన వారికి నేడు నియామక పత్రాలు…!

Share

లెక్చరర్లుగా ఎంపికైన అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి HYD రవీంద్రభారతిలో నియామక పత్రాలు అందజేయనున్నారు. జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి 2023లో పరీక్షలు నిర్వహించగా 1290 మంది ఎంపికయ్యారు. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు 2023లోనే పరీక్షలు నిర్వహించగా 240 మంది ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. వారిందరికీ సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేసి అభినందించనున్నారు.