ఈ నెల 15న పశ్చిమగోదావరిలోని తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన షెడ్యూల్ ఇవాళ లేదా రేపు ఖరారు కానుంది.
Post Views: 88








