Mahaa Daily Exclusive

  జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు: మంత్రి పార్థసారధి

Share

ఏపీలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి, అర్హులకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారధి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పారు. మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని విమర్శించారు.