Mahaa Daily Exclusive

  రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం…!

Share

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆహారం, మంచినీరు అందరికీ అందేలా చర్యలు చేపట్టామని అన్నారు. సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ బృందాలను సిద్ధం చేశామన్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలు ఏర్పాటు చేశామని వివరించారు.