Mahaa Daily Exclusive

  భట్టి విక్రమార్క నేతృత్వంలో డీలిమిటేషన్ పై భేటీ..!

Share

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణంలో డీలిమిటేషన్‌ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. డీలిమిటెషన్‌పై ఉన్న ఆందోళనను అన్ని పార్టీలతో చర్చించామని అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు చెప్పాయి.. ఇది ప్రాసెస్‌లో ముందడుగు అని జానారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాలు ఇంకా ఇంకా కొనసాగుతాయని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఆ రాష్ట్రంలో జరుగబోయే మీటింగ్‌కు తెలంగాణ డెలిగేషన్ వెళుతుందని స్పష్టత ఇచ్చారు. ఈ బృందంలో అన్ని పార్టీల నుండి ఒక్కొకరు ఉంటారని వెల్లడించారు. పార్టీల గైర్హాజరు తాత్కాలికమే.. భవిష్యత్తులో అన్ని కలిసి వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు.