తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ జైనథ్ మండలకేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేస్తానని హామీ ఇచ్చారని,ఆ ప్రకారంగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడు నెలల్లోనే శాసన ప్రక్రియను పూర్తి చేసిందని, 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం చేకూర్చిందని అన్నారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడి ఆశీర్వదించాలని కంది శ్రీనివాస రెడ్డి ప్రజల్ని కోరారు. అదేవిధంగా బేల మండలకేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేపట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ 42 శాతం పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం శుభపరిణామమని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం, దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపడం అభినందనీయమన్నారు. అంతకుముందు డప్పుకొట్టి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రంగినేని శాంతన్ రావు నాయకులు నాగర్కర్ శంకర్,దాసరి ఆశన్మ, రాంరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి,దేవదాయ శాఖ కమిటీ చైర్మన్ రూకేష్ రెడ్డి, గడ్డం జగదీశష్ రెడ్డి,వెంకన్న యాదవ్,బద్ధం భగవాండ్లు, మాజీ ఎంపీటీసీ వెంకన్న, అశోక్,బద్దం సురేష్, కొడిచెర్ల లాస్మన్న, ఏ.ఏం.సీ డైరెక్టర్ ఎల్మ రాం రెడ్డి,కప్రి లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.








