నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లా రెడ్డి కూడా హాజరయ్యారు. ఇంకేముంది మల్లన్న తన టాలెంట్‌ను మరోసారి ప్రదర్శించారు. వేదికపై నితిన్‌తో కలిసి స్టెప్పులు వేశారు. రాబిన్‌హుడ్ మూవీలోని అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ మల్లన్నా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Post Views: 148







