Mahaa Daily Exclusive

  కేంద్రమంత్రి బండి సంజయ్‌కి కేటీఆర్ కౌంటర్…!

Share

కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీదర్లో దొంగనోట్లు ముద్రించారన్న బండి సంజయ్.. కర్ణాటకలో అప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఉందనే విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. అప్పుడు ఎందుకు దర్యాప్తు చేయలేదని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రమంత్రిగా ఉండి పనికిమాలిన మాటలు మాట్లాడొద్దని కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.