Mahaa Daily Exclusive

  స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్‌ దంపతులు..!

Share

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించారు. భార్య నారా బ్రాహ్మిణి కుమారుడు దేవాన్ష్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన పర్యటన ఫొటోలను షేర్ చేశారు. పవిత్ర హర్‌మందిర్‌ సాహిబ్‌ను దర్శించుకొని అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.