Mahaa Daily Exclusive

  విశాఖ వేదికగా నేడు ఐపీఎల్‌.. తిలకించనున్న ఏపీ గవర్నర్..!

Share

విశాఖ వేదికగా నేడు ఐపీఎల్‌ క్రికెట్‌ యుద్ధం జరగనుంది. ఎప్పుడు స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూసేద్దామా అని ఎదురు చూసే క్రికెట్ అభిమానులు ఈరోజు రాత్రి 7.30 గంటలకు విశాఖ స్టేడియంకు వెళ్లి చూడవచ్చు. దిల్లీ క్యాపిటల్స్‌-లఖ్‌నవూ జట్లు తలపడనుండగా.. ఈ క్రికెట్ ని వీక్షించేందుకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రానున్నారు. ఈ మేరకు స్టేడియం వద్ద 1700 మంది పోలీసులతో నిఘా పెట్టారు.