అసెంబ్లీలో గంగుల కమలాకర్‌కు మంత్రి ఉత్తమ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లించడం లేదని, మోసాలకు పాల్పడుతున్న దళారులపై చర్యలు తీసుకోవడం లేదని కమలాకర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ.. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పండన్నంత వరి పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో పండిందని చెప్పారు. రైతులకు మంచి ధర ఉన్నప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Post Views: 105








