Mahaa Daily Exclusive

  అవయవ దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా శాసనసభలో మాజీ మంత్రి కేటీఆర్…!

Share

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. అవయవ దానానికి తాను సిద్ధమని చెప్పారు. గురువారం శాసనసభలో అవయవ దానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అవయవదానం చేయాలని… అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పారు. అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నియోజకవర్గాల్లో అవయవదానంపై చైతన్యం తీసుకురావాలని కేటీఆర్ అన్నారు. అవయవదానానికి సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామని అన్నారు. తొలి సంతకం తానే చేస్తానని చెప్పారు. అవయవదానం ఎంతో గొప్ప మానవీయ చర్య అని, ఇది మరికొందరికి జీవితాన్ని ప్రసాదిస్తుందని అన్నారు.