Mahaa Daily Exclusive

  ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Share

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో శుభం, ధర్మబద్ధ కోరికలు నెరవేరాలని, సమృద్ధ వానలతో రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, సంస్కృతి-సంప్రదాయాలతో ఉగాదిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ఆదివారం నుంచి విశ్వావసు నామ తెలుగు సంవత్సరాది ప్రారంభంకానుంది.