Mahaa Daily Exclusive

  24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: నాదెండ్ల

Share

కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.8,200 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. ఇవాళ విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టబడి ఉందని మంత్రి నాదెండ్ల తెలిపారు.