కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. కానీ సాదారణ భక్తుల సంఖ్యను తగ్గిస్తూ.. దర్శనాల సంఖ్య 60 వేల చుట్టూ పరిమితం చేస్తున్నారు. రోజుకు దాదాపు 10వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం, ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన’ అని నిలదీశారు.
Post Views: 126








