Mahaa Daily Exclusive

  జోగులాంబ అమ్మవారికి భారీ కానుక 1.585 కిలోల బంగారు కిరీటం బహూకరించిన ఐటీ ఉద్యోగులు ..!

Share

ఐదో శక్తి పీఠమైన మహిమగల జోగులాంబ అమ్మవారికి బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల బృందం బంగారు కిరీటాన్ని బహూకరించింది. కోటి 60 లక్షల 10 వేల 501 రూపాయలు విలువ చేసే 1.587 కిలోల బంగారు కిరీటాన్ని జోగులాంబ ఆలయం ఎండోమెంట్ ఆఫీసర్ పురేందర్, ఛైర్మన్‌ నాగేశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలకు అందజేశారు. బంగారు కిరీటంపై బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలంతో కూడిన ప్రతిమలున్నాయి. ప్రత్యేక పూజల అనంతరం బంగారు కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. బంగారు కిరీటాన్ని అమ్మవారికి బహుమతిగా తీసుకువచ్చిన భక్తులకు ఆలయ పూజారులు మేళ తాళాలతో స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో గణపతి పూజ, అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని అధికారులు, ధర్మకర్తల సమక్షంలో జోగులాంబ అమ్మవారికి బంగారు కిరీటం బహుకరించారు.