Mahaa Daily Exclusive

  హెచ్ సీయూ భూముల వివాదం టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండించిన రిజిస్ట్రార్…!

Share

గచ్చిబౌలి భూములపై హెచ్‌సీయూ రిజిస్ట్రార్ సోమవారం కీలక ప్రకటన చేశారు. 2024 జూలై‌లో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని తేల్చిచెప్పారు. హద్దులు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండించారు. ఇప్పటి వరకూ భూమి సరిహద్దులు గుర్తించలేదని అన్నారు. ఈ విషయంపై హెచ్‌సీయూకు సమాచారం ఇవ్వలేదని రిజిస్ట్రార్రు తెలిపారు. భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్నికోరతామని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ తెలిపారు. యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పర్యావరణం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీకి కేటాయించిన భూమిని బదిలీ చేయాలి అంటే విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి అధికారిక సమ్మతితోనే జరుగుతుందని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు