అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాను మూడోసారి బాధ్యతలు చేపట్టడాన్ని ఆయన తోసిపుచ్చలేదు. ఈ విషయంలో జోక్ చేయడం లేదని స్పష్టంచేశారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని నన్ను కోరుతున్నారు. అయితే దానికి ఇంకా చాలా సమయముందని వారికి చెప్పా. దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, మరోసారి అధికారం చేపడతారా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, తనకు పని చేయడం ఇష్టమని పేర్కొన్నారు.
Post Views: 111








