Mahaa Daily Exclusive

  HCUలో హృదయవిదారకంగా నెమళ్ల ఆర్తనాదాలు: కిషన్ రెడ్డి

Share

HCU భూములను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి కూడా బుల్డోజర్లతో చెట్లను కూల్చడం వల్ల అక్కడి నెమళ్ల ఆర్తనాదాలు హృదయవిదారకంగా ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు, విద్యార్థుల గొంతు నొక్కుతూ అత్యంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపి, HCU అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడాలన్నారు.