విద్యార్ధుల పోరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అట్టుడుకుతోంది. వివాదాస్పద స్థలం 400 ఎకరాల్లో బుల్డోజర్లు చదును ప్రారంభించిన నాటినుండీ ఒక్కసారిగా ఆందోళన బాట పట్టిన విద్యార్ధులు పగలు, రాత్రి కూడా ఆందోళనలు కొనసాగిస్తూ యూనివర్శిటీని అట్టుడికిస్తున్నారు. విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో ఓ వైపు మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కాగా, విద్యార్ధులతో మరోసారి చర్చించి వాస్తవాలు వివరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు నిర్ణయించారు. వారం క్రితం కూడా ఓసారి హెచ్ సి యు అధికారులతో మంత్రులు భేటీ అయినట్లు తెలిసింది.
Post Views: 102








