మాజీ సీఎం జగన్ బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో కోనసీమ, పశ్చిమగోదావరి, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. భవిష్యత్ కార్యచరణ పై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలో మార్పులు, చేరికలపై నాయకుల నుండి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని సైతం నేతలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.
Post Views: 131








