Mahaa Daily Exclusive

  సన్న బియ్యం స్కీంను వినియోగించుకోవాలి: మంత్రి సీతక్క

Share

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి సీతక్క బుధవారం ములుగు జిల్లాలోని గోవింద రావు పేట మండలాల్లో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దీనిని అందరూ వినియోగించుకోవాలని పేర్కొన్నారు.