గత మూడు దశాబ్దాలుగా వారి గుండెల్లో తమకు ప్రత్యేక స్థానం కల్పించిన కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల ప్రజల పట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి , ఎమ్మెల్యే పద్మావతి దంపతులు అన్నారు. ఈ రెండు నియోజకవర్గాల అభివృద్ధికి, ఇక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి తాము జీవితాలను అంకితం చేస్తున్నామన్నారు. ఇవాళ తాను తన సతీమణి పద్మావతితో కలిసి 35వ వివాహ వార్షికోత్సావాన్ని హైదరాబాద్‌లో జరుపుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా కోదాడ , హుజూర్ నగర్ ప్రజలను ఉద్దేశించి ఉత్తమ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ నియోజకవర్గాల్లోని తమ ప్రత్యేక కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లతో పాటు ప్రతి వ్యక్తి జీవితాలను మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా కృషి చేయడానికి నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఉన్నామని ప్రకటించారు








