Mahaa Daily Exclusive

  నేటి నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయల్లో సరికొత్త విధానం..!

Share

ఏపీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయల్లో సరికొత్త విధానం అమల్లోకి రానుంది. శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్లకు వెయిటింగ్ లేకుండా.. ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. ఇవాళ ఉ.10 గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించనున్నారు. తొలి విడతగా 26 జిల్లాలో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనున్నారు. మిగిలిన కార్యాలయాల్లో ఈనెలాఖరులోగా అమలు చేయనున్నారు.