Mahaa Daily Exclusive

  చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్‌రెడ్డి ..!

Share

తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీతాదయాకర్ రెడ్డితో పాటు ఆరుగురు సభ్యులను నియమించింది. కంచర్ల వందనగౌడ్, మర్రిపల్లి చందన, బి.అపర్ణ, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి.వచన్ కుమార్ లను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా బాధ్యతలు స్వీకరిచిన రోజు నుంచి మూడు సంవత్సరాలు లేదా వారికి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సీతాదయాకర్ రెడ్డికి నియామకపు ఉత్తర్వులు అందడంతో ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.