మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఇవాళ ఉత్తరాఖండకు వెళ్లనున్నారు. సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈనెల 7, 8 తేదీల్లో డెహ్రాడూన్‌లో చింతన్ శిబిర్ కార్యక్రమం జరగనుంది. ఇందులో పాల్గొనడానికి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరనున్నారు. బీసీలకు సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లపై పొన్నం ప్రసంగిస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల కోసం అమలు చేస్తున్న పథకాలను మంత్రి సీతక్క వివరిస్తారు.
Post Views: 126








