Mahaa Daily Exclusive

  ప్రజాసంఘాలతో మీనాక్షి నటరాజన్ భేటీ..!

Share

కంచ గచ్చిబౌలి వివాదంపై గచ్చిబౌలిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు సమావేశాలు నిర్వహించారు. స్టూడెంట్స్, యూనివర్సిటీ టీచర్స్,జేఏసి ప్రజా సంఘాలతో ఆమె మాట్లాడారు. ప్రజా సంఘాల నుండి లుబ్నా సర్వాంత్ , సూరేపల్లి సుజాత, బిలాల్ తదితరులు హాజరయ్యారు. యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్ పట్ల పాజిటివ్ దృక్పథం తో ఉండండి అని విద్యార్థులతో మీనాక్షి నటరాజన్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధుల డిమాండ్లపై వినతిని మీనాక్షి తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.