Mahaa Daily Exclusive

  పిప్రి సీతారాముల కల్యాణంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ …!

Share

భక్తి భావం అధికంగా ఉండే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శ్రీరామనవని సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించి, పలు వేడుకల్లో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణ వేడుకలలో టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. బాల్కొండ భీంగల్ మండలం లోని పిప్రి గ్రామంలో సీతారాముల కళ్యాణ వేడుకలో కుటుంబంతో కలిసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మొదటిసారిగా లొద్ది రామాలయంలో సీతారాముల కళ్యాణం వేడుకలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. స్వగ్రామం రహత్ నగర్ గ్రామ సరిహద్దులో ఉన్న లొద్ది రామాలయం అంటే టీపిసిసి చీఫ్ కుటుంబానికి ఎంతో సెంటిమెంట్ కాగా, ఈ ఆలయంతో ప్రత్యేక అనుబంధం, విశ్వాసం ఉన్నాయి. శ్రీరామనవమి వేళ పీసీసీ చీఫ్ ఆలయాలను సందర్శించడంతో స్థానికులు ఘనస్వాగతం పలకడంతో పాటు హర్షం వ్యక్తం చేశారు.