Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మరు 10 నెలల్లోనే కాంగ్రెస్ ఫెయిలైంది రాబోయేది బీజేపీ ప్రభుత్వమే మల్కాజిగిరి ఎంపీ ఈటల…!

Share

రేపటి ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదేనని ప్రజలు మెసేజ్ అందించారని మల్కాజిగిరి ఎంపీ టల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని చూసినం వారి పరిపాలన అనుభవమైందని, మళ్లీ ఓటు వేసే ప్రసక్తి లేదని ప్రజలు అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో విఫలమైందన్నారు. కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పథంలో నడపాలంటే బీజేపీ మాత్రమే నిజమైన పార్టీ అని ప్రజల్లో భావన ఉంది కాబట్టి.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బీజేపీ పార్టీనే అని జోస్యం చెప్పారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ లో జెండా పండుగ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తుందని చెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్లను ప్రజలు బీజేపీకి వేశారని, దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పకనే చెప్పారన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఎప్పుడూ ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మా పార్టీలో అధ్యక్షులు పదేళ్లు, ఇరవై ఏళ్లు వారసత్వంగా ఉండరు అని కామెంట్ చేశారు. మా ఢిల్లీ నాయకత్వం అంతా సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో ఉన్నారని అన్నారు.